శేరిలింగంపల్లి, డిసెంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మాదాపూర్ డివిజన్ ఖానామెట్ వీకర్ సెక్షన్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎంబీసీ చైర్మన్ జెరిపేటి జైపాల్ తో కలిసి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ గౌస్, మహిపాల్ యాదవ్, కృష్ణ గౌడ్, గంగల గణేష్ యాదవ్, మన్నెపల్లి సాంబశివ రావు, డివిజన్ అధ్యక్షులు నగేష్ నాయక్, భ్రమయ్య యాదవ్, కృష్ణ నాయక్, కేశవులు, రమేష్ నాయక్, కృష్ణ ముదిరాజ్, సుధాకర్ ముదిరాజ్, కోటేష్ తదితరులు పాల్గొన్నారు.