మారమోని శ్రీశైలం యాదవ్ కు ఘ‌న స‌న్మానం

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఆల్ ఇండియా యూత్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూత్ ఉపాధ్యక్షుడిగా మారమోని శ్రీశైలం యాదవ్ విజయం సాధించిన సందర్భంగా బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ శ్రీశైలం యాదవ్ గెలవడం సంతోషంగా ఉంద‌న్నారు. బీసీల హక్కులకు తన గళం విప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేకల రాములు యాదవ్, శెట్టి వంశీ మోహన్ యాదవ్, ఆర్కె కృష్ణయ్య సీనియర్ రిపోర్టర్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర సంఘ అధ్యక్షులు సాయన్న ముదిరాజ్, పాములేటి యాదవ్ రాజు యాదవ్, రిషి యాదవ్, ఎడ్ల కిరణ్ యాదవ్, మధు యాదవ్, బోల్లబోయిన గోవర్ధన్ యాదవ్, యాదవ సంఘం, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మారమోని శ్రీశైలం యాదవ్ ను స‌న్మానించిన బేరి రామ్ చందర్ యాదవ్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here