శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): సీడీ చవాన్, శ్రీ శ్రీ శ్రీ వీర ధర్మజ స్వామి,శ్రీ యోగీశ్ ప్రభు గురూజీ, వెంకట్ బాబు, రామలింగం, శివ సమక్షంలో గ్లోబల్ హిందూ ఫెడరేషన్ యాప్‌ను ప్రారంభించారు. హిందూ సంస్థలను ప్రపంచవ్యాప్తంగా ఐక్యం చేయడానికి కీలకమైన హిందూ వేదికగా కొనియాడారు. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సీడీ చవాన్ ఆలోచించి అభివృద్ధి చేసిన ఈ యాప్, దేవాలయాలు, సంస్థలు, వ్యక్తులను కలిపి హిందూ సమాజాన్ని బలోపేతం చేయడానికి రూపొందించబడిందని తెలిపారు.
గ్లోబల్ హిందూ ఫెడరేషన్ యాప్ పలు కీలక లక్ష్యాల ఆధారంగా నిర్మించబడిందని అన్నారు. హిందురాష్ట్ర లక్ష్యంతో హిందువులను ఐక్యం చేయడం, దేవాలయాలను నాశనం నుంచి రక్షించడం, లవ్ జిహాద్ నుండి హిందూ స్త్రీలను రక్షించడం, పశువుల సంక్షేమాన్ని నిర్ధారించడం, హిందూ సాంస్కృతిక, మతపరమైన కార్యకలాపాలను ప్రోత్సహించడం, కాపాడడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సీడీ చవాన్ శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, శ్రీ వీర ధర్మజ స్వామి, యోగీశ్ ప్రభు గురూజీ, మద్దతుదారులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజాన్ని ఐక్యం చేయడానికి, హిందూ సంపదను కాపాడడానికి అన్ని హిందూ సంస్థలు ఈ యాప్‌లో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. మరింత సమాచారం లేదా గ్లోబల్ హిందూ ఫెడరేషన్ లో నమోదు కోసం 92814 64855కి కాల్ చేయవచ్చని, వెబ్‌సైట్ www.globalhindufederation.net ను సందర్శించవచ్చని సూచించారు.