శేరిలింగంపల్లి, ఆగస్టు 3 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి విలేజ్ లో ఉన్న శ్రీ నల్ల పోచమ్మ తల్లి దేవాలయం, శ్రీ మహంకాళి తల్లి దేవాలయంలో జరిగిన బోనాల ఉత్సవాలలో MBC చైర్మన్ జేరిపేటి జైపాల్, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా ప్రజలందరికి బోనాల పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని అన్నారు. అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






