శేరిలింగంపల్లి, ఆగస్టు 3 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని లింగంపల్లి గ్రామంలో శ్రావణమాసం బోనాల పండుగ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ యూత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్, స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రవి యాదవ్ మాట్లాడుతూ పోచమ్మ తల్లి ఆశీర్వాదాలు మన గ్రామ ప్రజలందరికీ సమృద్ధిని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ పుణ్యోత్సవం ద్వారా మన సామాజిక ఐక్యత మరింత బలపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కే. ఎన్. రాములు, రవి కుమార్, గడ్డం శ్రీనివాస్, ప్రభాకర్ గౌడ్, శ్రీకాంత్ యాదవ్, వెంకట్ రెడ్డి, మహేష్, స్వామి, వెంకటేష్ యాదవ్, గంగాధర్ గౌడ్, నవీన్ గౌడ్, మహేష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.






