కూకట్ పల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 327, CVW B -2871 యూనియన్ ల మద్దతుతో కూకట్ పల్లి, కొండాపూర్ డివిజన్ ఆఫీసుల ఆవరణలో విద్యుత్ కార్మికులు నిర్వహించిన మొదటిరోజు రిలే నిరాహార దీక్ష విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆర్టిజన్ విద్యుత్ కార్మికుల హక్కుల సాధనకు గాను పి. శ్రీకాంత్, జి. రాజు, ఎం. శ్రావణ్, జె. రాజు, ఎస్. ఆదిమూర్తి తదితర కార్మికులు బుధవారం దీక్షలో కూర్చున్నారు.