పేద‌ల‌కు సీఎం రిలీఫ్ ఫండ్ ఆప‌న్న‌హ‌స్తం: ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

ఆల్విన్ కాలనీ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హాస్పిట‌ల్ బిల్లుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న బాధితురాలికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ బుధ‌వారం అంద‌జేశారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీకి చెందిన భారతి అనే మ‌హిళ ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 43వేల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు రామకృష్ణ గౌడ్, బ్రిక్ శ్రీనివాస్, విద్యా సాగర్, సురేందర్ , శ్రీనివాస్ చౌదరి పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి స‌హాయం అంద‌జేస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here