శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని తారానగర్ రాంరెడ్డి గార్డెన్స్ లో భారతీయ జనతా పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులతో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు హాజరై మాట్లాడుతూ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎన్. రామచందర్ రావు గెలవడం తథ్యమన్నారు. కౌన్సిల్ లో ప్రశ్నించే గొంతుకగా, ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుడు మనకు అవసరమని గ్రాడ్యుయేట్ ఓటర్లు కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తూన్నారని, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పునరావృతం కానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గజ్జల యోగానంద్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్ర ప్రసాద్, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, చింతకింది గోవర్ధన్ గౌడ్, కార్యదర్శి మూల అనిల్ కుమార్ గౌడ్, బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులు రాఘవేంద్రరావు, రాధాకృష్ణ యాదవ్, రఘునాథ్ యాదవ్, సింధు రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు రవి కుమార్ యాదవ్, మొవ్వా సత్యనారాయణ, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొరదాల నరేష్, బాల్ద అశోక్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ గౌడ్, వసంత్ కుమార్ యాదవ్, ప్రభాకర్ యాదవ్, డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రాంరెడ్డి, కృష్ణ ముదిరాజ్, మాణిక్యాల రావు, శ్రీధర్ రావు, రాజు శెట్టి, నర్సింగ్, కమలాకర్ రెడ్డి, నవీన్ గౌడ్ పాల్గొన్నారు.
