నేపాల్ గ్యాంగ్ దోపిడీ కేసులో మ‌రికొంద‌రు నిందితుల అరెస్టు

  • రూ.4.50 ల‌క్ష‌ల విలువ గ‌ల సొత్తు స్వాధీనం

గ‌చ్చిబౌలి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాయదుర్గం పరిధిలో సంచలనం సృష్టించిన నేపాలీ గ్యాంగ్‌ దోపిడీ కేసులో మరికొందరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్‌ 5వ తేదీన రాయదుర్గంలోని బీఎన్‌ఆర్‌ హిల్స్‌లో ప్లాట్‌ నం.42లో నివాసం ఉండే మధుసూదన్‌ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో అందరికీ ఆహారంలో మత్తు మందు ఇచ్చి వారు నిద్రించిన అనంతరం ఇంట్లో పనిచేస్తూ వచ్చిన నేపాలీ గ్యాంగ్‌ ఇంట్లోని బంగారం, నగదును దోచుకెళ్లిన విషయం విదితమే. కాగా ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు నిందితులను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఇప్పటికే రూ.5.2 లక్షల నగదు, 300 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోగా.. తాజాగా మరికొందరు నిందితులను అరెస్టు చేసిన అనంతరం వారి నుంచి కూడా మరింత సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి రూ.17వేల నగదు, 83 గ్రాముల బంగారం మొత్తం కలిపి రూ.4.50 లక్షల విలువ చేసే సొత్తును పోలీసులు రికవరీ చేశారు.

ఇక దోపిడీకి సంబంధించి అక్టోబర్‌ 11న నేత్రా బహదూర్ షాహి అలియాస్‌ నేత్ర (40), ప్రకాష్‌ షాహి అలియాస్‌ ప్రతాప్‌ (39), సీతా లావర్‌ (25)లను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా జానకి బుడయార్‌ (28), చక్ర భౌల్‌ అలియాస్‌ రితేష్‌ భోజల్‌ (23), అఖిలేష్‌ కుమార్‌ (30)లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని మెజిస్ట్రేట్‌ ముందు హాజర పరనున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసుతో సంబంధం ఉన్న రాజేందర్‌ అలియాస్‌ రవి, వినోద్‌ కమల్‌ షాహి, దేవి రమా దామ్లా అలియాస్‌ దీపక్‌, మనోజ్‌ బహదూర్‌ షాహి అలియాస్‌ మన్హ్‌ బహదూర్ షాహి (27)లు పరారీలో ఉన్నారని పోలీసులు తెలియజేశారు.

పోలీసుల అదుపులో చోరీ నిందితులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here