- జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్‌ను కోరిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ లోకేష్ కుమార్, చీఫ్ సిటీ ప్లానర్ (సీసీపీ) దేవేందర్ రెడ్డిలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నాలాల విస్తరణ పనుల నిమిత్తం నిధులను మంజూరు చేయాలని వారిని కోరారు. చందానగర్ లోని శ్రీదేవి థియేటర్ రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని అన్నారు. నాలాల విస్తరణ పనుల పురోగతిపై కమిషనర్ లోకేష్ కుమార్ కు గాంధీ వివరించారు. కాగా గాంధీ విజ్ఞప్తి మేరకు స్పందించిన కమిషనర్ లోకేష్ కుమార్ త్వరలోనే పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే నాలాల విస్తరణ పనులకు అవసరం అయ్యే నిధులను మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ సకాలంలో రోడ్లు, నాలా విస్తరణ పనులు పూర్తి అయ్యేలా చూస్తామని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నాలాల విస్తరణ చేపడుతామని, అసంపూర్తిగా మిగిలిపోయిన నాలాల విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు.






