గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని గచ్చిబౌలి డివిజన్ బీజేవైఎం అధ్యక్షుడు నక్క శివకుమార్ డిమాండ్ చేశారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయాన్ని బీజేవైఎం నాయకులు ముట్టడించగా పోలీసులు అరెస్టు చేశారు. కాగా తమను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు పవన్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం బీజేవైఎం నాయకులు గచ్చిబౌలిలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ బీజేవైఎం అధ్యక్షుడు నక్క శివ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అన్నింటినీ భర్తీ చేయాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని, గ్రూప్ 1 నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు పీఆర్‌సీ ని వెంటనే ప్రకటించాలని అన్నారు. అలాగే బీజేవైఎం నాయకుల మీద పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం శేర్లింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ కుమ్మరి జితేందర్, గచ్చిబౌలి డివిజన్ బిజెపి ప్రెసిడెంట్ కంచె మీద కృష్ణ, నీలం నరేందర్ ముదిరాజ్, రాహుల్, శివ గౌడ్, మీన్ లాల్ సింగ్, మూలా అనిల్ గౌడ్, శ్రీనివాస్ చారి, నీరుడి సురేష్, సతీష్ గౌడ్, వెంకటేష్, శ్యామ్ లెట్ నందు, శ్యామ్ యాదవ్, విజయ్, మార్ల తిరుపతి, ఈశ్వర్,పెద్దగోని సతీష్ గౌడ్, ప్రవీణ్ యాదవ్, బీజేవైఎం నాయకులు తిరుమణి సాయి కిరణ్, అనంతుల శివ శంకర్, కుమ్మరి ప్రవీణ్, సుమన్, సతీష్ గౌడ్, వెంకటేష్, దయాకర్, గచ్చిబౌలి డివిజన్ మహిళామోర్చా అధ్యక్షురాలు మహేశ్వరి పాల్గొన్నారు.
హఫీజ్‌పేటలో…
బీజేవైఎం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ హఫీజ్‌పేట డివిజన్‌లో డివిజన్ బీజేవైఎం అధ్యక్షుడు నందు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్ర ప్రసాద్, బీజేవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ కుమ్మరి జితేందర్, మాజీ కౌన్సిలర్ రమణయ్య, బీజేపీ నాయకుడు మహేష్ యాదవ్, బీజేవైఎం నాయకులు శ్రీనివాస్ రెడ్డి, శివ గౌడ్, మధు, క్రాంతి పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి డివిజన్‌లో…
శేరిలింగంపల్లి డివిజన్ బీజేవైఎం అధ్యక్షుడు క్రాంతి మాదిగ ఆధ్వర్యంలో తెరాస ప్రభుత్వం, నిరుద్యోగుల పట్ల వహిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తా వద్ద సీఎం కెసిఆర్ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్బంగా క్రాంతి మాట్లాడుతూ టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ ని వెంటనే నియమించాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, గ్రూప్-1 నోటిఫికేషన్ ని విడుదల చేయాలని, అప్పటివరకు నిరుద్యోగుల పక్షాన నిలబడి బీజేవైఎం పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేవైఎం నాయకుడు నీరటి చంద్ర మోహన్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శులు చిట్టా రెడ్డి ప్రసాద్, ప్రశాంత్ చారి, డివిజన్ ఉపాధ్యక్షులు కొడిదల బాబు, శ్రావణ్ పాండే, కార్యదర్శి మనోజ్ ముదిరాజ్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి బొట్టు కిరణ్, రవీందర్ పల్లపు, సాయి వెంకట్, భరత్ రాజ్, నగేష్ గౌడ్, శోభ పాల్గొన్నారు.

మాదాపూర్ డివిజన్‌లో…
మాదాపూర్ డివిజన్ లో డివిజన్ బీజేవైఎం అధ్యక్షుడు ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు వినయ్ బాబు, ఉపాధ్యక్షుడు వెంకటేష్ బాబు, ప్రధాన కార్యదర్శి వినోద్, బిజెపి సీనియర్ నాయకులు అశోక్ యాదవ్, మధు యాదవ్, గోవర్ధన్ రెడ్డి, రాజు, నాగార్జున, అశోక్ పాల్గొన్నారు.

చందానగర్ డివిజన్‌లో…
చందానగర్‌లో డివిజన్ బీజేవైఎం అధ్యక్షుడు తన్నీరు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం సీనియర్ నాయకుడు గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేవైఎం కన్వీనర్ కుమ్మరి జితేందర్, బీజేవైఎం నాయకుడు శివ గౌడ్, బీజేవైఎం చందానగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సాయి మురళి, బీజేవైఎం నాయకులు ప్రవీణ్ గౌడ్, నాగ మురళి, అనిల్, రాజేష్, రఫీ, రఘు పాల్గొన్నారు.

మొన్న covid lo శ్రమించిన ghmc అవుట్ sourcing ఉద్యగులా ను పేర్మినెంట్ చేస్తా బాగుంతది