గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ కాలనీలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ భారత దేశ ప్రధాన మంత్రిగా సేవలందించిన పీవీ దేశ అభివృద్ధి కోసం ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చారని కొనియాడారు.

పీవీ నరసింహారావు 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే గొప్ప జ్ఞాని అని అన్నారు. భారత దేశానికి పీవీ ఎంతో కీర్తి తెచ్చారని, పీవీ తెలుగు వాడు కావడం మన చేసుకున్న అదృష్టమని అన్నారు. నేటి యువత ఆయన అడుగు జాడలలో నడవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమర్ పాషా, రమేష్ గుప్తా, ప్రభాకర్ యాదవ్, శంకర్, చిన్న బందయ్య, ఆశ బేగం పాల్గొన్నారు.