ప‌ట్ట‌భ‌ద్రులంద‌రూ ఎమ్మెల్సీ ఓటు హ‌క్కు క‌లిగి ఉండాలి

  • ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

ఆల్విన్ కాలనీ ‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా పూర్తి చేసిన 800 ఓట‌రు న‌మోదు ద‌ర‌ఖాస్తు ప‌త్రాల‌ను ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ శ‌నివారం ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీకి అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా గాంధీ మాట్లాడుతూ.. ఓటరు నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ తమ ఓట్లను నమోదు చేసేలా చైతన్యం చేయాలని అన్నారు. 2017 కు ముందు గ్రాడ్యుయేట్ పూర్తి అయిన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు కలిగి ఉండేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ డివిజన్‌లో వీలైనంత మేర గ్రాడ్యుయేట్ లను ఓటరు నమోదు చేసుకునేలా చైతన్య పరుస్తామని, ఓటరు నమోదుకు అవసరమైన పత్రాలతో స్వయంగా నమోదు ప్రక్రియను పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీసీ సంఘం నాయకుడు రాజేష్ చంద్ర, నాయకుడు బోయే కిషన్ పాల్గొన్నారు.

ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీకి ఓట‌రు న‌మోదు ప‌త్రాల‌ను అంద‌జేస్తున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here