- బీజేపీ రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందడానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బీజేపీ రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. శనివారం పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి భాస్కర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందరర్భంగా భాస్కరరెడ్డి మాట్లాడుతూ ఆయన దృఢమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే 562కు పైగా సంస్థానాలు భారత్ లో విలీనమయ్యాయని అన్నారు. నెహ్రూ విధానం వల్ల నేటికీ దేశం అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నదని, పటేల్ లాంటి నాయకత్వమే దేశానికి అవసరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సైనిక విభాగం రాష్ట్ర జాయింట్ కన్వీనర్ నాగం రాజశేఖర్, వెంకటరమణ, వెంకట్ రెడ్డి, రాజు పాల్గొన్నారు.