కుమారుడి పుట్టినరోజు వేళ అనాధలకు, ఆరోగ్య సిబ్బందికి చేయూతనందించిన ఆదర్శ తండ్రి

నమస్తే శేరిలింగంపల్లి: బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కలివేముల మనోహర్ కుమారుడు సాయి వివేక్ కలివేముల పుట్టినరోజు సందర్భంగా బుధవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.హ‌ఫీజ్‌పేట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూల్ అండ్ హాట్ వాటర్ డిస్పెన్సర్ అదేవిధంగా వికారాబాద్ సమీపంలోని దన్నారం గ్రామంలో ఉన్న స్వామి వివేకానంద గురుకుల్ ఆఫ్ ఎక్సలెన్సీ అనాధ పాఠశాలకు ఇన్వెర్టర్ లను అందజేశారు. బిజెపీ రాష్ట్ర నాయకులు గజ్జల యోగానంద్, జ్ఞానేంద్ర ప్రసాద్ జిల్లా నాయకులు పోరెడ్డి బుచ్చిరెడ్డి, రాచమల్ల నాగేశ్వర్ గౌడ్ లతో కలిసి కలివేముల మనోహర్ హ‌ఫీజ్‌పేట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వినయ్ బాబుకు వాటర్ కూలర్ అందజేశారు. కొడుకు పుట్టినరోజు నాడు దావ‌త్‌లు దూమ్ దామ్‌దామ్‌లు అని సంద‌డి చేయ‌కుండా ఆరోగ్య సిబ్బందికి, అనాధలకు ఉపయోగపడే వస్తువులను అందజేసిన కలివేముల మనోహర్‌ను యోగానంద్ కొనియాడారు. ఇత‌ర‌ తల్లిదండ్రులు వారిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి గౌడ్, కోటేశ్వరరావు, రమేష్ సోమిశెట్టి, శ్రీధర్ రావు, మాణిక్యరావు, శ్రీశైలం, జితేందర్, పృథ్వి కాంత్ గౌడ్, లక్ష్మణ్, రామకృష్ణ, విజేందర్ సింగ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

హఫీజ్ పేట్ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వినయ్ బాబుకు కూలర్ ను అందజేస్తున్న మనోహర్, యోగానంద్, జ్ఞానేంద్ర ప్రసాద్, బుచ్చిరెడ్డి, నాగులు గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here