నేతాజీన‌గ‌ర్‌లో ఘ‌నంగా ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం-మొక్క‌లు నాటిన అధ్య‌క్షుడు భేరి రాంచంద‌ర్ యాద‌వ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని గచ్చిబౌలి డివిజన్ ప‌రిధిలోని నేతాజీ నగర్ సంక్షేమ సంఘం ఆద్వర్యంలో హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. స్థానిక‌ నల్లగండ్ల చెరువు కట్ట ప్రాంతంలో కాల‌నీ అధ్య‌క్షుడు భేరి రాంచంద‌ర్ యాద‌వ్ నాటాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ ప్రేమికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను విధిగ‌ సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించుకుంటే స‌కాలంలో వ‌ర్షాలు కురుస్తాయ‌ని, త‌ద్వారా స‌మృద్ధిగా పంట‌లు పండుతాయ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయ‌కులు బాలరాజ్ సాగర్, శివ, లక్ష్మణ్ మహదేవ్, రాజు, రమేష్, కృష్ణ, వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.

మొక్క‌లు నాటుతున్న నేతాజీ న‌గ‌ర్ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు భేరి రాంచంద‌ర్ యాద‌వ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here