నమస్తే శేరిలింగంపల్లి: సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు మహిళల అభ్యున్నతి కోసం హోప్ ఫౌండేషన్ చేదోడు వాదోడుగా నిలుస్తుందని ఆ సంస్థ నిర్వాహకులు కొండా విజయ్ అన్నారు. కొండాపూర్ డివిజన్ రాఘవేంద్ర కాలనీలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ చేతుల మీదుగా మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా కొండా విజయ్ మాట్లాడుతూ జీవనోపాధి కోసం నగరానికి వచ్చి రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న రెండు పేద కుటుంబాలకు చెందిన మహిళలు అశ్విని, శ్రీలత లు ఇటీవల కుట్టు శిక్షణ తీసుకున్నారన్నారు. స్వంతగా వారి ఇండ్లలో కుట్టు మిషన్ల ద్వారా టైలరింగ్ చేపట్టి ఆదాయం సమకూర్చుకునేందుకు అవకాశం ఉంటుందనే అలోచనతో మహిళలకు కుట్టు మిషన్లు ఆందజేసినట్లు హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ తెలిపారు.
