నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సిపిఎం సీనియర్ నాయకురాలు, తుంగతుర్తి మాజీ శాసన సభ్యురాలు వీరనారి మల్లు స్వరాజ్యం అనారోగ్యంతో మరణించడం బాధాకరమని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం మృతి పట్ల ఎంసీపీఐయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పించింది. కమ్యూనిస్టు ఉద్యమం ఐక్యం కావాలని అనేక వేదికలపై పరితపిస్తూ దోపిడీ పాలకవర్గానికి కమ్యూనిస్టు పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం అని చివరి శ్వాస వరకు స్వరాజ్యం పరితపించారని గాదగోని రవి అన్నారు. స్వరాజ్యం స్పూర్తి నేటి కమ్యూనిస్టు ఉద్యమం స్పూర్తిగా నివాళి అర్పిస్తున్నామని తెలిపారు.
