నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్క ప్రణాళికతో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ బస్తీ శ్మశాన వాటికలో నూతనంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను బస్తి నాయకులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం జరిగే షబ్ ఎ బరాత్ పెద్దల పండగకు శ్మశాన వాటికలో అన్ని ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ మాదాపూర్ డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శ డివిజన్ గా అభివృద్ధి చేస్తామన్నారు. డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య నగర్ బస్తీ అధ్యక్షుడు మునఫ్ ఖాన్, మాదాపూర్ డివిజన్ మైనారిటీ అధ్యక్షులు రహీం, నాయకులు లియాకత్, షోయబ్, సలీం, హాజీ, ఆదిత్య నగర్ బస్తీ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ఖాజా, యువకులు ఇమ్రాన్, సద్దాం, సయ్యద్ మెరాజ్ తదితరులు పాల్గొన్నారు.
