శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తాం – కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: శ్మశాన వాటికను అభివృద్ధి చేసి మహా ప్రస్థానంగా తీర్చిదిద్దుతామని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ స్మశాన వాటిక లో పెద్దల పండుగ అయిన షబ్ ఎ బారత్ పండుగకు అవసరమైన ఏర్పాట్లను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్మశాన వాటికలను అభివృద్ధి పరిచి, దహన కార్యక్రమాల సమయంలో అవసరమైన వసతుల కల్పనకు ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి పనులు చేసేలా చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. పీజేఆర్ నగర్, అంజయ్య నగర్, మార్తాండ్ నగర్, ప్రేమ్ నగర్ లలోని శ్మశాన వాటికలలో చేయాల్సిన అభివృద్ధి పనులు గురించి ఎమ్మెల్యే గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆయన వెంట సయ్యద్ ఉస్మాన్, మఖ్బుల్ చిచ్చా, సయ్యద్ అమీనుద్దీన్, జాఫర్, హర్షద్, పాషా భాయ్, అస్మాద్, జహీర్ మూల్ సాబ్, వాజీద్, మగ్దుమ్ భాయ్, అబ్దుల్ కరీం తదితరులు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here