నమస్తే శేరిలింగంపల్లి: అంతర్జాతీయ మహిళ దినోత్సవ సంబరాలను తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా మూడు రోజుల పాటు జరుపుకోవాలన్న మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మహిళా బందు కేసీఆర్ పేరిట రెండో రోజు నిర్వహించుకోవడం జరిగిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి నివాసం లో మహిళా పారిశుద్ధ్య కార్మికులకు కార్పొరేటర్ మంజుల రెడ్డి తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి వివాహం జరిపించి మరో శిశువుకు జన్మనిచ్చేంత వరకు ప్రతి దశలో అమ్మ వలె, అన్న వలె, మేనమామ వలె అండగా నిలుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ మహిళా బంధుగా భావిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు జనార్దన్ రెడ్డి, ధనలక్ష్మి, పబ్బా మల్లేష్, రవీందర్ రెడ్డి, అక్బర్ ఖాన్, యూసఫ్ పాషా, కొండల్ రెడ్డి, హరీష్ రెడ్డి, దాస్, నరేందర్ రెడ్డి, సికెందర్, అమిత్, వరలక్ష్మి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.
గచ్చిబౌలి డివిజన్ లో..
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ లో మాజీ కార్పొరేటర్ సాయిబాబా ఆధ్వర్యంలో మహిళ బంధు కేసీఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య మహిళ కార్మికులకు, అంగన్ వాడీ టీచర్లకు, హెల్పర్లకు, ఆశా వర్కర్లకు, ప్రభుత్వ పాఠశాల ఆయాలకు, బస్తీ దవాఖాన మహిళా సిబ్బందికి మొత్తం 125 మందికి మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ శాలువాతో సత్కరించి, చీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు నాయక్, నాయకులు రాగం జంగయ్య యాదవ్, నరేష్, అంజమ్మ, మీనా, సౌజన్య సతీష్ ముదిరాజ్, జగదీష్, నాగపురి అశోక్ యాదవ్, శంకరి రాజు ముదిరాజ్, గోవింద్, సత్యనారాయణ, పురిడి కృష్ణ, రమేష్ గౌడ్, బిక్షపతి యాదవ్, ఎల్ వెంకటేష్ ముదిరాజ్, మధు, నరేష్ సింగ్, శ్రీనివాస్, సుధీర్, నంది రాజు, పర్మేశ్, అరుణ కుమారి, రాణి, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
కొండాపూర్ డివిజన్ లో..
కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ బి బ్లాకులోని కమ్యూనిటీ హాల్ లో మహిళా బందు కేసీఆర్ సంబరాలను స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. డివిజన్ పరిధిలోని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ కలసి శాలువాతో సన్మానించారు. కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్బంగా మహిళలు థాంక్యూ సీఎం కేసీఆర్ అని చెప్పారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ మహిళా సాధికారాతకు పెద్ద పీట వేస్తూ, మహిళల సంక్షేమంతో పాటు ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు అబ్బుల కృష్ణగౌడ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సీనియర్ నాయకులు రూపరెడ్డి, డాక్టర్ రమేష్, మంగమ్మ, లావణ్య, శ్యామల, ఎల్లయ్య, అబేద్ అలీ, సత్తిబాబు, సులోచన, రమ, లక్ష్మి, సత్యవతి, కళ్యాణి, నాగలక్ష్మి, సమీనా, ముంతాజ్, బిబి, సలీమా బేగం, కానీష ఫాతిమా, వనజ, రఫియా బేగం, రేష్మ బేగం, షబానా, షరీఫా లబ్ధిదారులు పాల్గొన్నారు.