నమస్తే శేరిలింగంపల్లి: అసంఘటితరంగ కార్మికులు ఈ శ్రమ్ కార్డు కోసం పేరు నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని బిజెపి నాయకులు మొవ్వా సత్యనారాయణ, రవికుమార్ యాదవ్ సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం వద్ద ఈ -శ్రమ్ కార్డ్ సెంటర్ ను రవి కుమార్ యాదవ్, మొవ్వా సత్యనారాయణ ప్రారంభించారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికి కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ-శ్రమ్ కార్డు అసంఘటితరంగ కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదైన కార్మికునికి రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో ప్రతి బస్తీ, కాలనీలు, అపార్ట్‌మెంట్ లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ప్రతిఒక్కరూ లబ్ధి పొందేలా చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో కసిరెడ్డి సింధు రెడ్డి, కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, డి.ఎస్.అర్.కె.ప్రసాద్,రామిరెడ్డి, గూడూరి త్రినాథ్, శ్రీనివాస్ ముదిరాజ్, మల్లేశ్ గౌడ్, కిరణ్, శివ, మురళి, సాయి మురళి, శివ రత్నాకర్, పవన్, సాయి కిరణ్, లక్ష్మణ్ ముదిరాజ్, గుండె గణేష్, జె రాము తదితరులు పాల్గొన్నారు.