అసంఘటితరంగ కార్మికుల కోసం ఈ శ్రమ్ కార్డులు – బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: అసంఘటితరంగ కార్మికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుచూపుతో ఈ శ్రమ్ కార్డును అందజేయడం జరుగుతుందని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. చందానగర్ డివిజన్, పిఏ నగర్ లో ఈ-శ్రమ్ కార్డ్ సెంటర్ ను రవికుమార్ యాదవ్ ప్రారంభించి కార్మికులతో నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పేదలు, కార్మికుల కోసం ముందు చూపుతో ఈ-శ్రమ్ కార్డ్ ను రూపొందించారని అన్నారు. ఈ-శ్రమ్ కార్డ్ కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక కార్డు అని, 15000 ఆదాయం మించని ప్రతి కార్మికుడు ఈ-శ్రమ్ కార్డు పొందవచ్చన్నారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదైన కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షల ప్రమాద బీమా, అంగవైకల్యం కలిగితే లక్ష రూపాయల కవరేజీ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, డి.ఎస్.అర్.కె.ప్రసాద్, అజిత్, లక్ష్మణ్ ముదిరాజ్, గుండె గణేష్ ముదిరాజ్, జజేరావు రాము, గంగారామ్ మల్లేష్, సతీష్, నీలకంఠ, పాపయ్య, శివ, సోను, శ్రీధర్, వినోద్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

ఈ శ్రమ్ కార్డు నమోదు పత్రాలను అందజేస్తున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here