నమస్తే శేరిలింగంపల్లి: గోమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత హిందువులపై ఉందని, గోమాతలకు నిలయాలుగా మారిన గోశాలలను సంరక్షించుకోవాలని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. మియాపూర్ డివిజన్ డైనమిక్ కాలనీలో నిర్వహిస్తున్న గోశాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తున్నారని కాలనీ వాసులు, గోశాల నిర్వాహకులు రవికుమార్ యాదవ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందిస్తూ సంఘటన ప్రదేశానికి చేరుకుని పనులను నిలిపివేయించారు. స్థలానికి సంబంధించిన వివరాలు సేకరించి, పోలీసులతో మాట్లాడి అవసరమైతే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీను, వినోద్, శ్రీనివాస్ యాదవ్, స్థానిక కాలనీ వాసులు , గోశాల నిర్వాహకులు పాల్గొన్నారు.
