27న రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక

నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు మాస్టర్స్ ఎంపిక ప్రక్రియను ఈ నెల 27న చేపట్టనున్నట్లు మాస్టర్స్ అథ్లెటిక్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొండా విజయ్, ప్రధాన కార్యదర్శి నూనె సురేందర్ తెలిపారు. పీజేఆర్ స్టేడియంలో మాస్టర్స్ ఆథ్లెట్స్ తో కలిసి నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. మార్చి నెలలో వరంగల్ లో నిర్వహించే రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీలకు చందానగర్ లోని పీజేఆర్ స్టేడియం లో ఈ నెల 27న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు‌. ఎంపిక ప్రక్రియలో భాగంగా రన్నింగ్, త్రోబాల్, జంపింగ్, వాకింగ్ తదితర క్రీడల్లో పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. 35 సంవత్సారాలు పై బడి 80 సంవత్సరాలు పూర్తయిన వారు ఈ ఎంపిక ప్రక్రియలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఎంపిక లో పాల్గొనాలనునే వారు అదివారం ఉదయం పీజేఆర్ స్టేడియంలో రిజిష్ట్రర్ చేయించుకోవచ్చన్నారు. ఆన్ లైన్ ద్వారా సైతం రిజిస్ట్రేషన్ చేసుకునే‌ అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలకు 9394868993 సంప్రదించవచ్చని కార్యదర్శి నూనె సురేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ ఆథ్లెట్స్ జితేందర్ పటేల్, రంగారావ్, స్వాతి ధర్మపురి, జ్యోతి గౌడ్, సవితా ప్రకాశ్, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో ‌మాట్లాడుతున్న కొండా విజయ్, నూనె సురేందర్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here