నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పనులు చేపడుతామని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపునగర్ లో ప్రజా సమస్యలపై కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో యూజీడీ, ఓపెన్ నాలాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రాగం నాగేందర్ యాదవ్ చెప్పారు. చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, వాటర్ వర్క్స్ మేనేజర్ యాదగిరి, వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేష్, రాజు, గోపాల్ యాదవ్, రవీందర్, బసవరాజ్, ముంతాజ్ బేగం, శ్రీకాంత్ యాదవ్, జమ్మయ్య, లక్ష్మణ్ యాదవ్, పట్లోళ్ల నరసింహారెడ్డి, అలీ కాలనీ వాసులు పాల్గొన్నారు.