సమస్యలను పరిష్కరించండి – జడ్సీ, డీసీ కి బిజెపి నాయకుల ఫిర్యాదు

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి చేపట్టిన బస్తీ బాటలో తమ దృష్టికి వచ్చిన ఆయా కాలనీల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు జోనల్ కమిషనర్ ప్రియాంక ఆల, శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ వెంకన్నకు బిజెపి నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండాపూర్, శేరిలింగంపల్లి డివిజన్లలో చేపట్టిన బస్తీ బాటలో చాలా సమస్యలు తమ దృష్టికి వచ్చాయని రవికుమార్ యాదవ్ తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డి కాలనీలలో పారిశుధ్య ప్రక్రియ సరిగా లేదని ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని, సిద్దిక్ నగర్, అంజయ్య నగర్ బస్తీలలో రోడ్లు మీద డబ్బాలు పెట్టుకుని అధికార పార్టీ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారని జడ్సీ దృష్టికి తీసుకువచ్చారు.

సమస్యలు‌ పరిష్కరించాలని జడ్సీ ప్రియాంకకు వినతిపత్రం అందజేస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బిజెపి నాయకులు

అంజయ్య నగర్ వార్డు కార్యాలయంలో కొందరు వ్యక్తులు రేకుల షెడ్లు వేసుకుని నివాసం ఉంటున్నారని, ప్రజా అవసరాల కోసం కేటాయించిన ఖాళీ స్థలాలను, వాటర్ ట్యాంక్, నాలాలను టీఆర్ఎస్ నాయకులు ఆక్రమిస్తున్నారని అన్నారు. అంజయ్య నగర్ లో స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని అన్నారు. సానుకూలంగా స్పందించిన అధికారులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని రవి కుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ ఎల్లేష్, మాదాపూర్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధా కృష్ణ యాదవ్, కొండాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ ఆంజనేయులు సాగర్, హనుమంతు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి డీసీ వెంకన్నకు పలు సమస్యలపై ఫిర్యాదు చేస్తున్న రవికుమార్ యాదవ్, కార్పొరేటర్ గంగాధర్ రెడ్టి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here