జగన్మాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: ఎమ్మెల్యే గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధి గౌతమి నగర్ కాలనీలోని శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా చండీ హోమం నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, ఆయురారోగ్యాలతో , ధనధాన్యాలతో దిన దినాభివృద్ధి చెందాలని లోక కళ్యాణార్థమై మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు ఆధ్వర్యంలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన ఈ చండీ హోమంలో కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఆ జగన్మాత ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. చండి హోమం నిర్వహించిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘునాథ్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రసాద్, అక్బర్ ఖాన్, నరేందర్ బల్లా , వరలక్ష్మి, భవాని, దేవాలయ కమిటీ, ప్రధాన అర్చకులు, వేదపండితులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here