- ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పర్వదినం సందర్భంగా కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని దీనబంధు కాలనీలోని మైసమ్మ, పోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీక బోనాల పర్వదినం సందర్భంగా ప్రజలందరికి బోనాల పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు చెప్పారు. బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకునేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెలుతున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. బోనాల సందర్భంగా ప్రతి గుడి వద్ద అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండ అన్ని రకాల వసతులు కలిపిస్తూ ప్రశాంత వాతావరణం కలిపించామని, బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగేలా అన్ని ఏర్పాట్లను చేశామని, బోనాల పండుగ మంచి ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రసాద్, ఎండి ఇబ్రహీం, ఎల్లం నాయుడు, గిరి మోహన్ రావు, శెట్టి మహేందర్ నాయక్, వెంకటేష్ శుద్ధపల్లి సుధాకర్, జి ఎస్ ఆంజనేయులు, డేవిడ్, రామారావు, అశోక్ , ఎస్పీ మహేష్, కుమారు, సుహాషు, బాలు, నాగన్న , ఆవుల రాజు, శ్రీనివాస్ భక్తులు పాల్గొన్నారు.