నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట డివిజన్ పరిధి ఇంజనీర్స్ ఎంక్లేవ్ కమ్యూనిటీ హాలు వద్ద ఒమేగా హాస్పిటల్, గచ్చిబౌలి సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య మెగా శిబిరం నిర్వహించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎత్తు, బరువు, రక్తపోటు, షుగర్, పల్స్, ఈసీజీ, 2D ఎకోతో పాటు మహిళలకు పాప్ స్మెర్, మామోగ్రఫీ మొదలగు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. వైద్యులు డాక్టర్ అర్చన పబ్బు (జనరల్ ఫిజిషియన్), డాక్టర్ నమ్రత సాయి రెడ్డి ( ఆంకాలజిస్ట్ ) వైద్య సేవలు అందించారు. ప్రతి ఒక్కరు నిత్యం వ్యాయామం, యోగ, ధ్యానము చేయాలనీ సూచించారు.
ఈ వైద్య శిబిరంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఆంజనేయ రాజు, ప్రసాద్, సంబిరెడ్డి, కరుణాకర్ గౌడ్, చంద్రశేఖర్, వెంకట్రావు, బుచ్చేయ, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనార్ధన్,
వెంకట ధర్మసాగర్, నేమాని విశ్వశాంతి, బాలాజి, విష్ణుప్రసాద్ హాస్పిటల్ ప్రతినిధులు అనురాగ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో 120 మందికి వైద్యసేవలు అందించారు.