ఆత్మ రక్షణకు కుంగ్ ఫు, కరాటే దోహదం: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన “కుంగ్ ఫు మార్షల్ ఆర్ట్స్ అకాడమీని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కుంగ్ ఫు మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సెంటర్ ను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయమని, ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు ఎంతగానో తోడ్పడుతుందని, ఇక్కడి ప్రాంత యువత మార్షల్ ఆర్ట్స్ ద్వారా నైపుణ్యం పెంపొందించుకోవాలని, ఆత్మ రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో తోడ్పడుతుందని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా  నేటి సమాజంలో చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ ఎంతో అవసరం అని , ఆత్మ రక్షణ కోసం కరాటే, కుంగ్ పూ విద్యలు ఎంతగానో దోహద పడుతాయని చెప్పారు. అదేవిధంగా చిన్నారులలో  దాగిన నైపుణ్యాన్ని గుర్తించి ఆ విధంగా   ప్రోత్సహించడం  ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని, పేదరికం అనేది విజయాలకు అడ్డంకి కాదని నిరూపించారని, క్రీడాకారులను అభినందించారు. జాతీయ స్థాయిలో పాల్గొని పథకాలు సాధించేలా కృషి చేయాలన్నారు. ఈ సందర్బంగా నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు గోపి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బి ఏస్ ఎన్, కిరణ్ యాదవ్, బ్రిక్ శ్రీనివాస్, ప్రసాద్, ఎల్లం నాయుడు, విద్యాసాగర్, నారాయణ రావు, కిషోర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here