- బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్, బీజేపీ నాయకులతో కలిసి పరామర్శ
- ప్రజలకు సమాధానం చెప్పలేక దాడి చేసిన కే.పి వివేకానంద పై చర్యలు తీసుకోవాలి
- ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి అనర్హుడిగా ప్రకటించాలి
- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : బుధవారం ఓ టీవీ చానెల్ డిబేట్ లో కుత్భుల్లాపూర్ ఆపద్ధర్మ ఎమ్మెల్యే కేవీ వివేకానంద.. బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై దాడి అమానుషమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి కుమార్ యాదవ్ అన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్, బీజేపీ సీనియర్ నాయకులతో కలిసి వెళ్ళి ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న ఆపద్ధర్మ ఎమ్మెల్యే వివేకానంద ప్రవర్తించిన తీరు పట్ల తీవ్రంగా ఖండించారు. వివేకానంద అరాచకాలపై నిజాలు బట్టబయలు చేయడం జీర్ణించుకోలేక, ప్రజలకు సమాధానం చెప్పలేక, ఓ వీధి గూండాలాగా రెచ్చిపోయి.. శ్రీశైలం గౌడ్ గొంతు పట్టుకొని రౌడీలా దాడికి పాల్పడ్డారని అన్నారు. ఈ దాడిని ఈసీ దృష్టికి తీసుకెళ్తామని , ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.