హ్యాట్రిక్ ఖాయం

  • ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కే మా మద్దతు
  • ముక్తకంఠంతో నినదించిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనోహర్ గౌడ్, హుడా కాలనీ వాసులు

నమస్తే శేరిలింగంపల్లి: మళ్ళీ మూడోసారి బిఆర్ఎస్ రావడం ఖాయం అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనోహర్ గౌడ్, హుడా కాలనీ వాసులు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో కాలనీ వాసులతో ఆత్మీయ సమావేశం ఆత్మీయంగా జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనోహర్ గౌడ్, హుడా కాలనీ వాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో తమ పూర్తి స్థాయి మద్దతు ప్రభుత్వ విప్ గాంధీకే అని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తనపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.
ముచ్చటగా మూడో సారి భారీ మెజారిటీ తో గెలిచి శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలబెట్టడానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనోహర్ గౌడ్, లక్ష్మారెడ్డి, వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్, మిద్దెల మల్లారెడ్డి, ఉరిటీ వెంకట్ రావు, ప్రవీణ్, ప్రసాద్, రవీందర్ రెడ్డి, రాజు యాదవ్, తిరుమలేష్ , సిద్ధి రాములు, లక్ష్మీ, మాధవి, రాదమ్మ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు, అభిమానులు
పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here