నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నృత్యోదయ కూచిపూడి డాన్స్ అకాడమీ డాక్టర్ ప్రసన్న రాణి శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. వినాయక కౌతం, కృష్ణం కలయసఖి, జతిస్వరం, భామాకలాపం, జనుత శబ్దం, అష్టలక్ష్మి స్తోత్రం, బాల కనకయ్య, వన్డే వసుదేవం, మండూక శబ్దం, నవదుర్గలు అంశాలను వైష్ణవి, గీతాంజలి, ప్రాధాన్య, సుస్మిత, అక్షయ, గాయత్రీ, లక్ష్య, మేధా, ఉన్నతి, వేద మొదలైన వారు ప్రదర్శించారు . శ్రీ లోక భూమా రెడ్డి, మాజీ విజయ డైరీ చైర్మన్ ముఖ్య అతిథిగా విచ్చేసి కళాకారులను సత్కరించారు.