- నివాళులర్పించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
నమస్తే శేరిలింగంపల్లి: సీనియర్ జర్నలిస్ట్, దివంగత సిహెచ్‌విఎం కృష్ణారావు అందించిన సేవలు మరువలేనివని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గోపన్‌పల్లి లోని జర్నలిస్ట్స్ కాలనీలోని కృష్ణారావు నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. హర్యానా గవర్నర్ ప్రైవేట్ సెక్రటరీ కైలాస్ నగేష్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గజ్జల యోగానంద, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, జిల్లా ఓబీసీ మోర్చ అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు మహిపాల్ రెడ్డి, నాయకులు శాంతి భూషణ్ రెడ్డి, రాఘవేందర్ రావు, కుమార్ యాదవ్ పాల్గొన్నారు.