నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలో కొత్తగూడ విలేజ్ లోని కమ్యూనిటీ హాలు ప్రాంగణం వద్ద సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు వేసిన ముగ్గులతో ఆయా పరిసర ప్రాంతాలు రంగవల్లికలతో కళ కళ లాడాయి.
ముఖ్య అతిథిగా కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ హాజరై రంగవల్లికలను తిలకించి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ముగ్గుల పోటీలలో పాల్గొని, గెలిచిన విజేతలకు బహుమతులను అందజేశారు. ప్రతి ఒక్కరికి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేశం పుణ్యవతి, రఫియా బేగం, సంగీత, సునీత, షాహిజా, లక్ష్మమ్మ, రమాదేవి, రేవతి, జి. లక్ష్మమ్మ, సుజాత, లావణ్య, పూజిత, సునీత, సరిత, మమత, శ్వేత, మాధవి, నీలం రాము, కేశం కుమార్, నీలం లక్ష్మణ్, మొహ్మద్ ఖాసీం, యాదగిరి, శ్రీను, శ్రీకాంత్, రాజు, నగేష్, తిరుపతి పాల్గొన్నారు.