నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి బస్తీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ప్రజా పాలనకు నిదర్శనంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను సాగిస్తుందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అన్ని విధాలుగా అందేలా చూస్తామని తెలిపారు.

కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ నగర్ బస్తీలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కోక్కటిగా పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో నాయకులు మన్నేపల్లి సాంబశివరావు, కృష్ణ గౌడ్, కృష్ణ యాదవ్, రహీం, సంగారెడ్డి, మహమ్మద్ సాజిద్, రజక, అమినుద్దీన్, మొయినుద్దీన్, సయ్యద్ బాబా, యూసుఫ్, ఇస్మాయిల్, హమీద్, ఖాజా, సయ్యద్, నదీమ్, మహేష్, సుబ్బు పాల్గొన్నారు.





