నమస్తే శేరిలింగంపల్లి : అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారధ్యంలో శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామికి స్వరార్చన, వీణా గానం నిర్వహించారు.
తొలుత శోభా రాజు విద్యార్థులు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్, శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రమ్, శ్రీ అన్నమాచార్య అష్టోత్తర శత నామావళి, గురుస్తుతితో ప్రారంభించారు. అనంతరం వాడే వేంకటేశుడనే వాడు అనే అన్నమయ్య సంకీర్తన ముక్త కంఠంతో ఆలపించారు. అనంతరం జయంతి తమ గాత్ర పరిమళంతో, వీణాగాన ప్రదర్శనతో అందరిని అలరించారు. ఇందులో భాగంగా, “పరమాత్మడైన హరి, చేరి యశోదకు, జయ జయ రామ, జగద్ధోధరణ, నగవులు నిజమని, భావయామి గోపాలబాలం” వంటి ప్రముఖ సంకీర్తనలకు స్వరార్చన, మరియు “శ్రీమన్నారాయణ, కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు, బంటురీతి, ఒకపరికొకపరి, అదిహో అల్లదిహో శ్రీహరివాసము” అనే బహుళ ప్రచుర్యంలో ఉన్న అన్నమయ్య సంకీర్తనలకు మృదు మధురంగా వీణాగానం చేశారు.
అనంతరం, సుష్మ వేద శిష్య బృందం “వేదంబెవ్వని వెదెకెడిని, నీ నామమె మాకు నిధియు, నిధానము, చూడరమ్మ సతులాల” అనే సంకీర్తనలతో అందరిని అలరించారు. వీరికి మృదంగం మీద అనీష్ వాయిద్య సహకారం అందించారు. అనంతరం కళాకారులను సంస్థ అధ్యక్షులు డా. శోభా రాజు శాలువా జ్ఞాపికతో సత్కరించారు.