నటుడు కోట శ్రీనివాసరావు కి “చిత్ర విజ్ఞతాఖని” బిరుదు

నమస్తే శేరిలింగంపల్లి: గురు పూర్ణిమ సందర్భంగా అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షుడు పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారథ్యంలో వేంకటేశ్వర స్వామి వారి ఖడ్గమైన తాళ్ళపాక అన్నమాచార్యుల వారిని స్తుతిస్తూ డాక్టర్ అన్నమయ్య అష్టోత్తరం డాక్టర్ శోభా రాజు తో కలిసి వారి శిష్యులు పటించారు. కార్యక్రమం తొలుతగా అన్నమ గాయత్రి మంత్రంతో ప్రారంభించి, “అన్నమయ్య పుర గురు స్మరణం సకల క్లెశ శంసయ్య హరణం…” హరియవతార మీతడు అన్నమయ్య” ఎక్కనున్న నితడు, కొండలలో నెలకొన్న, మాతృ దేవోభవ పితృ దేవోభవ, చిలుకా ఎగిరిపో, స్వర్గమై డోలికగా” వంటి బహుళ ప్రాచుర్యం పొందిన పాటలను ఆలపించారు. సంకీర్తనలకు కీబోర్డ్ పై రాజేశ్వర రావు, తబలా పై నోవా సహకరించారు.


చిత్రసీమలో అనేక పాత్రలు పోషించి ఎంతో మెప్పు పొందిన కోట శ్రీనివాస రావుని, కళాకారునిగా తనకా గుర్తింపు రావడం భగవద్సంకల్పంగా భావించి, అశేష ప్రజాభిమానాన్ని పొందారని, తాను నమ్మిన సత్యాలను నిష్కర్షగా చెప్పగల నిర్మలమైన మనస్సున, సద్లౌకికాలౌకిక విజ్ఞతకు సాకారమైన కోట శ్రీనివాస రావుని “చిత్ర విజ్ఞతాఖని” బిరుదుతో అన్నమాచార్య భావనా వాహిని సంస్థ అధ్యక్షులు శోభా రాజు సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ నంద కుమార్ సత్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర సలహాదారులు కె వి రమణా చారి ఐ ఎ ఎస్ (రిటైర్డ్), మాట్లాడుతూ తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యులపై నాలుగు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చెయ్యటమే కాకుండా అనేక శిష్యులకు అన్నమయ్య కీర్తనలు భావం ప్రదానంగా నేర్పిన శోభా రాజు ధన్యులని, సంకీర్తనలు ఆలపించిన శిష్యులను కార్యక్రమానికి హాజరైన వారందరిని చిత్ర పటాన్ని ఇచ్చి సత్కరించారు. అన్నమయ్య సాహితీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామికి మంగళ హారతి, నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని విచ్చేసిన వారందరికీ పంచడంతో కార్యక్రమం ముగిసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here