వేడుకగా గురుపౌర్ణమి.. ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ లోని సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకలలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండి . ఇబ్రహీం, సందీప్ రెడ్డి, దీక్షిత్ రెడ్డి , నరేందర్ బల్లా, యశ్వంత్, ఓం ప్రకాష్ గౌడ్, కూన సత్యం గౌడ్ పాల్గొన్నారు.

 

సాయి ఐశ్వర్య కాలనీ లో ..
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయి ఐశ్వర్య కాలనీలోని సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు చేశారు. మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండి . ఇబ్రహీం, కాలనీ వాసులు పద్మ, అశోక్ రాజు, సత్యనారాయణ, రాజశేఖర్, శ్రీనివాస్, భరద్వాజ్ పాల్గొన్నారు.

 

హాఫిజ్ పేట్ జనప్రియ నగర్ లో..
హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ లోని సాయిబాబా దేవాలయంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ్ గౌడ్, Md. ఇబ్రహీం, సందీప్ రెడ్డి, దీక్షిత్ రెడ్డి , నరేందర్ బల్లా, యశ్వంత్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here