నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధి శిల్పారామంలో నిర్వహించిన నృత్య మాలిక సాంస్కృతిక కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాంచందర్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ నృత్య మాలిక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయన్నారు.

కళాకారులకు అరుదైన గౌరవమని, తల్లిదండ్రులు తమ పిల్లలకు వారి నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని, వారిలో దాగున్న కళను గుర్తించి దానికి తగ్గ సాధన చేయిస్తే వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని, మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తారని, కళామతల్లిలో ఒదిగిపోతారని, మంచి కళ నైపుణ్య ప్రదర్శనలు చేశారని, నిర్వహకులను, పిల్లలను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ మరియు హరికృష్ణ పాల్గొన్నారు.
