నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని గ్రేస్ అనాథాశ్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పితృ దినోత్సవము నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ వాసులకు అల్పాహారం అందజేసి, వృద్ధులకు పాద నమస్కారాలు చేసి తదనంతరం కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడారు. “తన కష్టాలకు, త్యాగాలకు ఏ విధమైన ప్రతిఫలం ఆశించని నిస్వార్థ వ్యక్తి నాన్న” అని అన్నారు. ” తన సంతానాన్ని వేలు పట్టుకొని లోకాన్ని పరిచయం చేసిన వ్యక్తి నాన్న” అని అన్నారు.
“తల్లి నవమాసాలు మోసి జన్మనిస్తే, తండ్రి తన సంతానం ఎదుగుదలకు అహర్నిశలు శ్రమించే వ్యక్తి నాన్న” అన్నారు. నేటి యువత స్వార్థ చింతన విడనాడి పెద్దలను, తల్లిదండ్రులను గౌరవిస్తూ, కడదాకా వారి పట్ల ప్రేమానురాగాలు చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకుడు శ్రీనివాస్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, ధర్మసాగర్ పాల్గొన్నారు.