- పాల్గొని మొక్కలు నాటిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామంలో స్కై వుడ్స్ గేటెడ్ కమ్యూనిటీ హరితహారం కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని మొక్కలు నాటారు.
పర్యవరణ పరిరక్షణకు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అసోసియేషన్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.