ఆరెకపూడి గాంధీని గెలిపించుకుంటాం

  • ఏకగ్రీవ తీర్మానం చేసి తీర్మాన పత్రం అందజేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎరుకల సంఘం కార్యవర్గ సభ్యులు

నమస్తే శేరిలింగంపల్లి : రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎరుకల సంఘం కార్యవర్గ సభ్యులు తీర్మాణం చేశారు. ఈ ఏకగ్రీవ తీర్మానం పత్రంను వివేకానంద నగర్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి అందజేశారు. ఇందులో భాగంగా తెలంగాణ ఎరుకల సంఘం (కుర్రు) గ్రేటర్ హైదరబాద్ కమిటీ అధ్యక్షులు రస్థాపురం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బిజిలి ఎల్లేశ్, కమిటీ ఆధ్వర్యంలో ఎరుకల ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేశారు.

బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఏకగ్రీవ తీర్మానం చేసిన  శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎరుకల సంఘం కార్యవర్గ సభ్యులు

ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షులు కూతాడి రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎరుకల సంఘం కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తమకు ఎన్నోవిధాలుగా అండగా ఉన్న గాంధీని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఆరెకపూడి గాంధీ

రాష్ట్ర అధ్యక్షులు కుతాడి రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎరుకల సమాజం కోసం ఎంతగానో కృషి చేశారని, ప్రజలకు న్యాయం జరిగినదని, పందులపై ఆధారపడి జీవిస్తున్న 50 వేల కుటుంబాలకు ఎరుకల సాధికారికత పథకం ప్రవేశపెట్టి రూ. 60 కోట్ల నిధులు ఇచ్చిన ప్రభుత్వమని ఎరుకల జాతికి రాజకీయంగా అవకాశాలు కల్పించారని ఎమ్మెల్సీగా సత్యనారాయణని, కూకట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా కూతడి రాములుకి అవకాశం కల్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు సత్యనారాయణ , గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బిజిలి ఎల్లేశ్, రాష్ట్ర కోశాధికారి కూతడి రవి కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగులు, పోచయ్య, వెంకటేష్, నర్సింహ, రాణెమ్మ, విశ్వనాథ్, నర్సింగ రావు, వేణు, అనిల్, దుర్గ ప్రసాద్, ఆనంద్, శోభ, రేణుక, లక్ష్మీ, నరేష్ , అరవింద్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here