-రేపు కొండకల్ శంకర్ గౌడ్ వర్ధంతి
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): మంచి అభ్యుదయ వాది, స్నేహశీలి, చిన్నతనం నుంచే కష్టాలను ఎదురీది సామాజికంగా తనకంటు ఒక స్థానం సంపాదించుకున్నవాడు. సామాన్యుడు సైతం రాజకీయంగా ఏంతో ఎత్తుకు ఎదగవచ్చు అని తన జీవితాన్నే ఉదాహారణగ చూపినవాడు. శేరిలింగంపల్లి లాంటి హైటెక్ నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జీగా, ఆ పార్టీ రాష్ట్ర బీసి సెల్ అధ్యక్షుడిగా ఏళ్లపాటు పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వాడు. కేసీఆర్, కేటీఆర్ లతో సహా తెలంగాణలోని రాజకీయ ప్రముఖులు అందరికి సుపరిచితుడు. ఉనికి కోల్పోతున్న సమయంలో శేరిలింగంపల్లిలో టీఆర్ఎస్ పార్టీకి ఆజ్యం పోస్తూ… భాద్యతను తన భూజాన వేసుకొని నియోజక వర్గంలో గులాబి పరిమలాన్ని విరభూయించిన కొండకల్ శంకర్ గౌడ్ మృతి చెంది రేపటికి(23/09/2020) ఆరేళ్లు పూర్తి.
చందానగర్ గాంధీ విగ్రహం వద్ధ రేపు శ్రద్ధాంజలి…
దివంగత కొండకల్ శంకర్ గౌడ్ వర్ధంతిని పురస్కరించుకుని బుదవారం చందానగర్ గాంధీ విగ్రహం వద్ద ఉదయం 10 గంటలకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మిద్దెల మల్లారెడ్డి, తిరుమలేష్ లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొండకల్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారిని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.