అర్హత‌ కలిగిన పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోవాలి: రాగం

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పట్టభద్రులతో సమావేశమైన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

-శేరిలింగంపల్లి డివిజన్ పట్టభద్రులకు కార్పొరేటర్ రాంగం నాగేందర్ యాదవ్ అవగాహన సమావేశం

శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): అర్హత‌ కలిగిన పట్టభద్రులు అందరూ ఓటరు నమోదు చేసుకోవాలని, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విధిగా ఓటు‌హక్కును వినియోగించుకోవాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పట్టభద్రులకు వార్డు కార్యాలయంలో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు పట్టభద్రులకు ఫాం 18 ను రాగం నాగేందర్ యాదవ్ అందజేశారు. పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియ అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం‌ కానుందని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. డివిజన్ పరిధిలో 2017 సంవత్సరం కంటే ముందు డిగ్రీ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్స్ ఓటరు నమోదు కోసం కో ఆర్డినేటర్లను ఏర్పాటు చేసుకోవడం‌ జరుగుతుందన్నారు. ఈ కో ఆర్డినేటర్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తమై శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో 5000 మందికి పైగా పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాల్సిన బాధ్యత కో ఆర్డినేటర్లపై ఉందన్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ఇప్పటి వరకు చాలా మంది ఓటు హక్కు లేక బాధపడేవారు ఉన్నారని గ్రాడ్యుయేట్లందరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. ఇందుకు అందరూ సహకరించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అధిక మెజారిటీ తో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు శ్రీకళ, కొడిచర్ల రాము, కవిత తో పాటు యశ్వంత్ రాజ్ యాదవ్, రోహిత్ యాదవ్, మోహన్ రెడ్డి, అరుణ, శ్వేత, సుభాషిణీ, దివ్య, శ్రీనివాస్, సంజీవ్, రఘువీర్, గోపాల కృష్ణ, మహేందర్ సింగ్, నర్సింలు, నాగరాజు, విక్రమ్ యాదవ్, వినోద్, సుధీర్, జయచంద్ర,‌ విష్ణువర్థన్ రెడ్డి, వి.‌కిషోర్, కో ఆర్డినేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పట్టభద్రులకు ఓటరు నమోదు కోసం ఫామ్ 18 పత్రాలను అందజేస్తున్న కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here