నమస్తే శేరిలింగంపల్లి: గోపినగర్ కాలనీ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్ తండ్రి కిష్టయ్య యాదవ్ సోమవారం మధ్యాహ్నం అనారోగ్యంతో మృతి చెందారు. ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ లు కిష్టయ్య భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. అనంతరం గోపాల్ యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు.