బస్తీ సమస్యలను పరిష్కరిస్తాం.. ప్రభుత్వ పథకాలను ప్రజల దరికి చేరుస్తాం

  • జై భీమ్ యూత్ అసోసియేషన్ గంగారం విలేజ్ నూతన కమిటీ అధ్యక్షుడిగా కంది పెంటయ్య

నమస్తే శేరిలింగంపల్లి: జై భీమ్ యూత్ అసోసియేషన్ గంగారం విలేజ్ నూతన కమిటీ అధ్యక్షుడిగా కంది పెంటయ్య ఎంపికయ్యారు. అదేవిదంగా జనరల్ సెక్రెటరీగా కంది జ్ఞానేశ్వర్, జాయింట్ సెక్రెటరీగా కంది ప్రమోద్, కంది రాజ్ కుమార్లను మిగతా కమ్యూనిటీ సభ్యులందరి సహాయ సహకారాలతో ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా కంది పెంటయ్య మాట్లాడుతూ బస్తీలో నెలకొన్న సమస్యలను, ప్రభుత్వ పథకాలను ప్రజల దారికి చేర్చడంలో కృషి చేస్తామని, ఏమైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కారానికి ముందుంటామని తెలిపారు. జనరల్ సెక్రటరీ కంది జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటామని, ఏ సమస్య వచ్చినా తమను సంప్రదించాలన్నారు. నూతన జై భీమ్ యూత్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here