- అర్ధరాత్రి ఆకస్మికంగా రోడ్డు పనుల పరిశీలన
- పనులు నాణ్యతతో చేపట్టాలని అధికారులకు ఆదేశం
నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అర్థరాత్రి ఆకస్మికంగా వెళ్లి పరిశీలించారు. ఈ పనులను రూ. 40 లక్షల అంచనావ్యయంతో చేపడుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. గోకుల్ ప్లాట్స్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తామని, కాలనీ లో జరుగుతున్న రోడ్డు పనులను అర్థరాత్రి ఆకస్మికంగా వెళ్లి తెల్లవారుజామున వరకు అక్కడే ఉండి స్వయంగా నాణ్యత ప్రమాణాలను పరిశీలించామని తెలిపారు. సీసీ రోడ్ల అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని , నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బ్రిక్ శ్రీనివాస్, గుమ్మడి శ్రీనివాస్, కృష్ణ ప్రసాద్, కృష్ణ కాలనీ వాసులు పాల్గొన్నారు.