నమస్తే శేరిలింగంపల్లి: మనం ఇంత స్వేచ్ఛగా మనగల్గుతున్నామంటే, డాక్టర్ బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగమే కారణమని, ఆయన చూపించిన బాటలో అడుగులేద్దామని బిజెపి రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరి త్రినాథ్ ఆద్వర్యంలో శ్రీరాంనగర్ కాలనీ, చందానగర్లో జరిగిన జయంతి కార్యక్రమంలో ఆయన మాటాడుతూ… అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలనే ఆయన తపనను నిజం చేయడం కోసం శ్రమిద్దామని, నడుచుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్రరావు, డివిజన్ అద్యక్షుడు గొల్లపల్లి రాంరెడ్డి, మాజీ కార్పోరేటర్ నవతారెడ్డి, జిల్లా ఉపాద్యక్షుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి, అసెంబ్లీ మాజీ కో-కన్వీనర్ అజిత్ కుమార్ సేనాపతి, డివిజన్ నాయకులు వేణుగోపాల్ పగడాల, వనమా శ్రీనివాస్, శివకుమార్ వర్మ, దేవకి, డాక్టర్ రాజేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, కిషన్ నాయక్, సింధు, చందర్ రావు, గౌస్ తో పాటు అనేక మంది డివిజన్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
